హైదరాబాద్ (సెప్టెంబర్ – 04) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (tspsc ) రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో భర్తీ చేయనున్న 247 పాలిటెక్నిక్ లెక్చరర్ల ఉద్యోగాలకై పరీక్షలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి.
ఇందుకు సంబంధించి హాల్ టికెట్లను (polytechnic lecturers exam hall tickets) వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
సెప్టెంబర్ 4 నుండి 8వ తేదీ వరకు రోజుకు రెండు సెషన్స్ చొప్పున ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం సెషన్ 10.00 నుండి 12:30 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 2.40 గంటల నుండి 5.00 గంటల వరకు కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (CBRT) పద్దతిలో నిర్వహించనున్నారు. పరీక్షకు 45 నిమిషాల ముందు వరకు హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి.
అభ్యర్థులు రెండు పోస్టులకు దరఖాస్తు చేస్తే రెండు పేపర్లకు సంబంధించిన మొదటి పేపర్ (జనరల్ స్టడీస్) ను కచ్చితంగా రాయవలసి ఉంటుందని టిఎస్పిఎస్సి స్పష్టం చేసింది.
ఎన్ని పోస్టులకు దరఖాస్తు చేసే అన్ని పోస్టులకు సంబంధించిన హాల్ టికెట్లను విడివిడిగా డౌన్లోడ్ చేసుకోవాలని స్పష్టం చేసింది.