హైదరాబాద్ (జూలై – 01) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 8,180 GROUP – 4 EXAMS ఉద్యోగాల భర్తీకి నేడు (జులై 1) రాతపరీక్షలు నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లు చేసింది.
ఈ పరీక్షకు 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 30 వరకు 8.81 లక్షల మంది వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ పరీక్ష కోసం TSPSC రాష్ట్రవ్యాప్తంగా 2,878 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది.
అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు ఫొటోగుర్తింపు కార్డు తప్పనిసరి తీసుకెళ్లాలని స్పష్టం చేసింది. హాల్టికెట్, ప్రశ్నపత్రం నంబరు సరిగా రాయకున్నా, బబ్లింగ్ చేయకపోయినా, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ కాకుండా ఇంక్ పెన్, జెల్ పెన్, పెన్సిల్ ఉపయోగించినా ఓఎంఆర్ పత్రం చెల్లుబాటు కానిదిగా గుర్తిస్తామని స్పష్టం చేసింది. పరీక్ష కేంద్రాలుగా గుర్తించిన పాఠశాలలకు పాఠశాల విద్యాశాఖ సెలవు ప్రకటించింది.