GROUP – 1 PRELIMS : నేడే ప్రిలిమ్స్ పరీక్ష – నిబంధనలు ఇవే…

హైదరాబాద్ (జూన్ – 11) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను (Group – 1 Prelims exam) ఈరోజు ఉదయం 10:30 నుంచి 1.00 వరకు నిర్వహించనుంది. 15 నిమిషాలు ముందే పరీక్ష హల్ లోకి చేరుకోవాలి. తర్వాత అనుమతి లేదు.

గ్రూప్ – 1 ప్రిలిమ్స్ పరీక్షలకు కొన్ని కఠిన నిబంధనలను అమలు చేయనున్నారు పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కచ్చితంగా తెలుసుకోవాల్సిన ఆ నిబంధనలు.

★ నిబంధనలు :

1) పరీక్ష కేంద్రానికి హల్ టికెట్ మరియు ఐడీ కార్డుతో హజరు కావాలి.
2) పరీక్ష కేంద్రానికి 15 నిమిషాలు ముందే చేరుకోవాలి.
3) ఉదయం 10.15 తర్వాత ఒక్క నిమిషం ఆలస్యం అయినా అనుమతి లేదు.
4) బ్లూ & బ్లాక్ బాల్ పాయింట్ పెన్ లను మాత్రమే అనుమతిస్తారు.
5) ఎలక్ట్రానిక్ పరికరాలను ఏ రూపంలో అనుమతించరు
6) నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసు నమోదు, తదపరి టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు అనర్హత.
7) బూట్లు ధరించి రాకూడదు, కేవలం చెప్పులు ధరించి రావాలి.
8) హల్ టికెట్ లో పోటో సరిగ్గా లేకుంటే గెజిటెడ్ అధికారితో సంతకం చేయించుకునన్న 3 పాస్పోర్ట్ సైజ్ పోటోలు తీసుకుని రావాలి.
9) పరీక్ష కేంద్రంలో ఎలాంటి స్లోగన్స్ ఇవ్వరాదు.
10) వైట్‌నర్, ఏరేజర్, బ్లేడ్, చాక్ పౌడర్ వంటి వాటికి అనుమతి లేదు.

◆ నోటిఫికేషన్ వివరాలు

మొత్తం పోస్టుల సంఖ్య – 503
దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య – 3,80,081
పరీక్ష కేంద్రాల సంఖ్య – 994
పరీక్ష తేదీ & సమయం – జూన్ – 11 – 2023 ఉదయం 10.30 నుండి 1.00 వరకు
పరీక్షకు అనుమతి ఇస్తున్న అభ్యర్థుల సంఖ్య – 3,80,032
పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉదయం 8.30 నుండి.

https://bikkinews.com/tspsc-group-1-preliminary-exam-hall-tickets-download-link/04/06/