TSPSC : నేడు, రేపు భూగర్భ జల శాఖ గెజిటెడ్ ఉద్యోగ పరీక్షలు

హైదరాబాద్ (జూలై – 18) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తెలంగాణ రాష్ట్రంలోని భూగర్భ జల శాఖలో గెజిటెడ్ పోస్టుల భర్తీ కోసం నేడు, రేపు కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించనుంది.

పరీక్షకు 45 నిమిషాల ముందు వరకు హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు హాల్ టికెట్లు ఇవ్వబడిన నిబంధనలు తప్పకుండా పాటిస్తూ పరీక్షకు హాజరుకావాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచించింది.

జూలై 18, 19వ తేదీలలో రెండు సెషన్స్ చొప్పున పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10:00 నుండి 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నిమిషాల నుండి 5.00 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

TSPSC GROUD WATER DEPARTMENT GAZETTED OFFICERS EXAM HALL TICKETS