హైదరాబాద్ (మే – 21) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వివిధ ఇంజనీరింగ్ శాఖలలో ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్, ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి నేడు, రేపు కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (CBRT)పద్ధతిలో నిర్వహించనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1,343 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
రోజుకు రెండు సెషన్స్ చొప్పున రెండు రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి.