TSPSC PAPER LEAK : అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష రద్దు

హైదరాబాద్ (మార్చి – 15) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చి ఐదున నిర్వహించిన అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్షను రద్దు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. TSPSC PAPER LEAK కారణంగా ఇప్పటికే ఓవర్సీర్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పరీక్షలను రద్దు చేసిన టిఎస్పిఎస్సి మరో పరీక్షను రద్దు చేసింది.

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ విషయం రాష్ట్రంలో సంచలనంగా మారిన నేపథ్యంలో ఇంకా ఎన్ని ఉద్యోగ పరీక్షలు రద్దు అవుతాయో అనో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే పరీక్షా తేదీలను వెల్లడిస్తామని టీఎస్పీఎస్సీ తెలిపింది.