TSPSC : జూనియర్ లెక్చరర్, ఎకౌంట్స్ ఆఫీసర్ పరీక్ష తేదీలు వెల్లడి

హైదరాబాద్ (మే – 23) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో రెండు పరీక్షల తేదీలను వెల్లడించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్ లకు సంబంధించిన పరీక్ష తేదీలను వెల్లడించింది.

జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 12 అక్టోబర్ 03 వరకు కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ పద్ధతిలో పరీక్షలను నిర్వహించనున్నారు. మొత్తం 16 సబ్జెక్టులకు 11 రోజుల పాటు ఉదయం జనరల్ స్టడీస్ పేపర్, మధ్యాహ్నం సంబంధిత సబ్జెక్టు పేపర్ పరీక్షలను నిర్వహించనున్నారు.

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్ పోస్టుల భర్తీకి ఆగస్టు 8న పరీక్ష కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ పద్ధతిలో నిర్వహించనున్నారు