హైదరాబాద్ (మే – 09) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అగ్రికల్చర్ ఆఫీసర్ (AO EXAM HALL TICKETS) ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు 45 నిమిషాల ముందు వరకు హల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మే 16వ తేదీన కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (CBRT) విధానంలో రెండు సెషన్ లలో ఈ పరీక్ష జరగనుంది. ఉ. 10.00 నుంచి మ. 12.30 వరకు, మ. 2.30 నుంచి సా. 5.00 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.