TSPSC : నేడే AEE మెకానికల్ పరీక్ష

హైదరాబాద్ (మే – 09) :తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE MECHANICAL) పరీక్ష CBRT పద్డతిలో జరగనుంది.

పరీక్షకు 45 నిమిషాల ముందు వరకు హల్ టికెట్లు వెబ్సైట్ లో అందుబాటులో ఉండనున్నాయి. వివిధ ఇంజనీరింగ్ శాఖలలో ఖాళీగా ఉన్న 97 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (మెకానికల్) పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

మే 21, 22 తేదీల్లో 1,343 సివిల్, ఎలక్ట్రికల్ ఉద్యోగాలకు పరీక్ష జరగనున్నది.

1,540 ఏఈఈ ఉద్యోగాలకు నిరుడు సెప్టెంబర్ 3న నోటిఫి కేషన్ రాగా, జనవరి 22న పరీక్ష జరిగింది. ప్రశ్నపత్రాల లీకేజీతో TSPSC పరీక్షను రద్దు చేసింది. గతంలో అన్నింటికీ ఒకేసారి ఓఎంఆర్ పద్ధతిలో పరీక్ష నిర్వహించగా, నేడు 4 దఫాలుగా ఆన్లైన్ లో నిర్వహించనున్నారు.