హైదరాబాద్ (జూన్ – 30) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గతంలో విడుదల చేసిన గ్రూప్ – 3 నోటిఫికేషన్ ద్వారా 1,375 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. వీటికి తోడుగా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన 13 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను (Group – 3 notification posts number incresased) జతపరుస్తూ ప్రకటన విడుదల చేసింది.
ఇంజనీర్ ఇన్ చీఫ్ ఇరిగేషన్ శాఖలో ఈ 13 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. దీంతో గ్రూప్ – 3 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న మొత్తం పోస్టుల సంఖ్య 1388 కి చేరింది. గతంలో గ్రూప్ – 3 కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ ఈ పోస్టులకు కూడా అర్హులే.
గ్రూప్ – 3 పరీక్ష తేదీన ఇంకా వెల్లడించాల్సి ఉంది. జూలై లేదా ఆగస్టు నెలలో గ్రూప్ – 3 పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.