POLICE JOBS : సర్టిఫికెట్ వెరిఫికెషన్ కు ఇంటిమేషన్ లెటర్స్

హైదరాబాద్ (జూన్ – 09) : తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు (TSPLRB) ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషను ఈనెల 14 నుంచి 26 నిర్వహించడానికి షెడ్యూల్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ఇంటిమేషన్ లెటర్ లను విడుదల చేయనుంది. 18 కేంద్రాల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనుంది.

ఈ నేపథ్యంలో తుది రాత పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులు వెబ్సైట్ నుంచి తమ ఇంటిమేషన్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది.

ఈ ఇంటిమేషన్ లెటర్లు జూన్ 11వ తేదీ ఉదయం 8.00 గంటల నుంచి 13వ తేదీ రాత్రి 8.00 గంటల వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

◆ వెబ్సైట్ : www.tslprb.in