హైదరాబాద్ (జూన్ – 06) తెలంగాణ స్టేట్ లెవల్ రిక్రూట్మెంట్ బోర్డు (TSPLRB) ఎస్.ఐ., కానిస్టేబుల్ అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో దొర్లిన తప్పులను ఎడిట్ చేసుకునేలా (police applications edit option) చివరి అవకాశం కల్పించింది.
జూన్ 6వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 8వ తేదీ రాత్రి 8 గంటల వరకు దరఖాస్తులను చివరిగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఫీజు చెల్లించాలి.
ఎడిట్ చేసుకునే వివరాల ఆధారంగా ఎడిట్ ప్రక్రియను ఏ బి సి కేటగిరీలుగా విభజించారు.
ఏ – కేటగిరి ఎడిట్ ఆప్షన్ కు ₹ 5000/- (ఎస్సీ, ఎస్టీ – ₹ 3,000/-) చెల్లించాలి.
బి – కేటగిరీ ఎడిట్ ఆఫ్షన్ కు ₹ 3,000/- (ఎస్సీ, ఎస్టీ – ₹ 2,000/-) చెల్లించాలి.
సి – కేటగిరీకి లోని అంశాల ఎడిట్ ఆఫ్షన్ లేదు