హనుమకొండ (ఏప్రిల్ 26) : TS NPDCL పరిధిలో జూనియర్ అసిస్టెంట్-కమ్ – కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు మే 28న నిర్వహించాల్సిన పరీక్షను వాయిదా వేసినట్టు సీఎండీ అన్నమనేని గోపాలరావు ప్రకటించారు.
యూపీపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలు కూడా ఇదే తేదీన ఉండటంతో ఎన్పీడీసీఎల్లో నిర్వహించే పరీక్షలను జూన్ 4కు వాయిదా వేసినట్టు తెలిపారు. ఉదయం 10.30 నుంచి జరిగే ఈ పరీక్షకు అభ్యర్థులు సకాలంలో హాజరుకావాలని కోరారు.