హైదరాబాద్ (జూలై – 01): తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు (TSPLRB) ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు దృవపత్రాల పరిశీలన పూర్తి అయినట్లు ప్రకటించింది.
అయితే కొందరు అభ్యర్థులు వయసు, విద్యార్హత లేకున్నా దరఖాస్తు చేశారని పోలీస్ నియామక మండలి వెల్లడించింది. ధృవపత్రాల పరిశీలన సమయంలో అర్హత లేనివారి దరఖాస్తులను తిరస్కరించామని తెలిపింది. పోలీస్ ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా జరుగుతోందని తెలిపింది.
◆ 3 లక్షల బహుమతి :
పోలీసు నియామక ప్రక్రియలో అక్రమాల గురించి పక్కా సమాచారం ఇస్తే రూ 3 లక్షల పారితోషికం ఇస్తామని ప్రకటించింది. ఫిర్యాదుల కోసం 9393711110 or 9391005006 నెంబర్లను సంప్రదించాలని సూచించింది.