తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 21 లా కాలేజీల్లో న్యాయ విద్యలో ప్రవేశాలు కల్పించడం కోసం నిర్వహించే లాసెట్ నోటిఫికేషన్ – 2021 విడుదలయ్యింది. ఈ ప్రవేశ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనున్నది.
ఈ ప్రవేశపరీక్ష ద్వారా మూడేండ్ల LLB, ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ LLB కోర్సుల్లో (BA LLB, BBA LLB, BCom LLB, BSc LLB) ప్రవేశాలు కల్పిస్తారు. అదేవిధంగా రెండేండ్ల పీజీ లా కోర్సుల్లో (LLM) ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
● అర్హతలు :: ఐదేండ్ల ఎల్ఎల్బీ కోర్సులకు.. 45 శాతం మార్కులతో ఇంటర్ పాసై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
మూడేండ్ల లా కోర్సులకు.. 45 శాతం మార్కులతో డీగ్రీ ఉత్తీర్ణులవ్వాల్సి ఉంది. అయితే ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
● ఎంపిక పద్దతి :: రాత పరీక్ష ద్వారా
● దరఖాస్తు విధానం :: ఆన్లైన్లో
● దరఖాస్తు ఫీజు ::
- లాసెట్ – రూ.800, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.500
- పీజీలాసెట్ – రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.800
● దరఖాస్తులు ప్రారంభం :: మార్చి 24
● దరఖాస్తులకు చివరితేదీ :: మే 26
● రాత పరీక్ష :: ఆగస్టు 23
● వెబ్సైట్ :: https://lawcet.tsche.ac.in
Follow Us@