ఇంటర్ పరీక్ష పీజు చెల్లింపు గడువు పెంపు

తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులు 2021 22 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు -2021 కొరకు పరీక్ష ఫీజు తేదీన మార్చి 31 వరకు గడువు పెంచుతూ ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.

3,000 రూపాయల ఆలస్య రుసుముతో మార్చి 31 – 2021 వరకు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పరీక్ష ఫీజు చెల్లించుటకు ఇదే చివరి అవకాశం అని ఇంటర్మీడియట్ బోర్డు వర్గాలు తెలిపాయి. కావున పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పరీక్ష ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియట్ బోర్డు వర్గాలు తెలిపాయి.

Follow Us@