ఎడ్ సెట్, ఐసెట్, లాసెట్ – 2021 షెడ్యూల్ విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థుల కోసం నిర్వహించే లా సెట్, ఐసెట్, ఎడ్ సెట్ – 2021 ప్రవేశ పరీక్షల తేదీలను తెలంగాణ ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఇప్పటికే ఎంసెట్, ఈసెట్, పీజీఈసెట్ పరీక్షల తేదీలను ఉన్నత విద్యా మండలి ఖరారు చేసిన విషయం తెలిసిందే.

★ ఐసెట్ – 2021షెడ్యూల్ ::

ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ ఏప్రిల్ 3వ తేదీన విడుదలవుతుందని, దీనికి సంబంధించిన ఏప్రిల్ 7 నుంచి మే 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని, ఆగస్టు 19 & 20 తేదీల్లో ఐసెట్ పరీక్షలు ఉంటాయని వెల్లడించారు.

★ లా సెట్ – 2021 షెడ్యూల్ ::

మూడేళ్లు, ఐదేళ్లు పీజీ లా కోర్సులో ప్రవేశాల కోసం లా సెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మార్చి 24 వ తేదీన విడుదలవుతుందని, దరఖాస్తుల స్వీకరణ కూడా అదే రోజున ప్రారంభమై మే 26వ తేదీ వరకు గడువు ఉంటుందని తెలిపారు. ఆగస్టు 23వ తేదీన లాసెట్ పరీక్ష ఉంటుందని తెలిపారు.

★ ఎడ్ సెట్ -2021 షెడ్యూల్ ::

బీఈడీ కోర్స్ లలో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్ సెట్ – 2021 ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ మార్చి 20వ తేదీన నోటిఫికేషన్ విడుదల అవుతుందని తెలిపారు. మార్చి 24 నుంచి మే 5 వరకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. పరీక్షలు ఆగస్టు 24 & 25 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించినట్లు పాపిరెడ్డి తెలిపారు.

Follow Us@