బదిలీల సమస్యపై అధికారులతో మాట్లాడతా – హరీష్ రావు

తెలంగాణ రాష్ట్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకుల బదిలీలపై స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేసి 60 రోజులు గడుస్తున్నా అధికారులు ఇంకా కనీసం బదిలీ మార్గదర్శకాలు విడుదల చేయలేదు.

ఈ నేపథ్యంలో ఈ రోజు కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకుల ఆర్జేడీ సంఘం అధ్యక్షుడు గాదె వెంకన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావును కలిసి బదిలీ బాధితుల సమస్యను వివరించడం జరిగింది.

దీనిపై స్పందించిన మంత్రి హరీష్ రావు అధికారులతో మాట్లాడి బదిలీ మార్గదర్శకాలను వీలైనంత త్వరగా విడుదల చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగిందని గాదె వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు.

Follow Us@