ఇంటర్ పస్టీయర్ ఫెయిలైన విద్యార్థులను కూడా పాస్ చేయాలి.

తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ ఫస్టియర్ లో ఫెయిలైన స్టూడెంట్లకు సప్లిమెంటరీ పరీక్షలు పై బోర్డు నుండి ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో వివిధ సబ్జెక్టుల్లో ఫెయిలైన విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ర్టంలో 2019–20 విద్యా సంవత్సరంలో దాదాపు 4.85 లక్షల మంది విద్యార్థులు ప్రథమ సంవత్సరం పరీక్షలు రాశారు. దాదాపు లక్షా తొంబై వేల మంది మంది ఫెయిల్​ అయ్యారు.

కరోనా కారణంగా సెకండియర్​లో ఫెయిల్ అయిన విద్యార్థులందరిని పాస్ చేశారు. కానీ ప్రథమ సంవత్సరం విద్యార్థుల విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఇంప్రూవ్​మెంట్ కు పరీక్షలు వ్రాసి మార్కులు పెంచుకుందాం అనుకున్న విద్యార్థులు కూడా సప్లిమెంటరీ పరీక్షలకోసం ఎదురుచూస్తున్నారు. దీంతో అటు ఫెయిలైన విద్యార్థులు, ఇటు ఇంప్రూవ్ మెంట్ రాయాలనుకున్న విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు.

పస్టీయర్ లో ఫెయిలైన విద్యార్థులందరిని ప్రభుత్వం పాస్ చేయాలి. లేకపోతే సెకండియర్​తో పాటే ఫస్టియర్ ఎగ్జామ్స్ రాయడం స్టూడెంట్స్ కు కష్టమవుతుంది. సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించకపోతే ప్రభుత్వ కళాశాలల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులే ఎక్కువగా నష్టపోతారు. ప్రభుత్వం ఇప్పటికైనా సప్లిమెంటరీ పరీక్షల పై వెంటనే నిర్ణయం తీసుకోవాలి.

డా. మధుసూదన్​రెడ్డి,

ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్

Follow Us@