TS TET 2023 : నేడు టెట్ నోటిఫికేషన్

హైదరాబాద్ (ఆగస్టు – 01) : తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET 2023) నోటిఫికేషన్ను ఈరోజు లేదా రేపు జారీ చేసే అవకాశం ఉంది.

SCERT అధికారులు నోటిఫికేషన్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం లేదా బుధవారం అధికారికంగా నోటిఫికేషన్ ను జారీ చేసి దరఖాస్తు స్వీకరించే అవకాశం ఉంది.