త్వరలో టీఎస్ టెట్

ముఖ్యమంత్రి కేసీఆర్ 50 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో టీచర్ల భర్తీ ప్రక్రియ ప్రారంభంకానున్న నేపథ్యంలో టీచర్‌ అర్హత పరీక్ష (TSTET)ను నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ దృష్టి సారించింది.

చివరి సారిగా 2017లో టెట్‌ను నిర్వహించారు. అందులో 45 వేల మంది మాత్రమే అర్హత సాధించారు. ఇప్పుడు కొత్తగా 1.50 లక్షల మంది బీఈడీ, డీఈడీ పూర్తిచేసినవారు, గతంలో అర్హత సాధించనివారు దాదాపు రెండు లక్షల వరకు ఉన్నారు. బీఈడీ పూర్తి చేసినవాళ్లు ఎస్‌జీటీకి కూడా అర్హులేనని ఎన్‌సీటీఈ ప్రకటించటంతో ఈ సారి దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది.

2021 నుంచి టెట్‌లో ఒకసారి అర్హత సాధిస్తే జీవిత కాలం వర్తిస్తుండటంతో ఈసారి నిర్వహించబోయే పరీక్షకు ప్రాధాన్యత పెరుగనున్నది.

కొవిడ్‌ కారణంగా దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించి, పరీక్షను కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని భావిస్తున్నారు.

Follow Us@