తెలంగాణ రాష్ట్రం లోని పదవ తరగతి ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ రోజు విడుదల చేశారు. కరోన సెకండ్ వేవ్ కారణంగా ఈ సంవత్సరం కూడా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే నేరుగా పాస్ చేయడం జరుగింది. ఫార్మేటివ్ అసెస్మెంట్ (FA1) మార్కుల ఆధారంగా మార్కులను కేటాయించడం జరిగింది.
మధౄ మూడు గంటలకు వెబ్సైట్ లో ఫలితాలు అందుబాటులో ఉండనున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5,21,073 మంది విద్యార్థులు పాస్ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. FA1 లో 20 మార్కులకు వచ్చిన మార్కులను 100 మార్కులకు అన్వయిస్తారు.
ఫలితాల కోసం కింద ఇవ్వబడిన వెబ్సైట్ ను సందర్శించండి.
Follow Us @