పదవ తరగతి పరీక్షలకు 6 పేపర్లే!

కరోనా నేపథ్యంలో పాఠశాలలు తెరుచుకోలేదు దీంతో తరగతులను ఆన్‌లైన్‌లో ఇప్పటికే బోధిస్తన్న విషయం తెలిసిందే.

అయితే వార్షిక పరీక్షలను కూడా తగ్గించి పదో తరగతి పరీక్షలను 11 పేపర్ల నుంచి 6 పేపర్లకు తగ్గించే అవకాశాలను విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు.
ఈ విద్యా సంవత్సరంలో సబ్జెక్టుకు ఒక పేపరు చొప్పున మొత్తం 6 పరీక్షలే నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఇక పరీక్షల సమయాన్ని కూడా గంటన్నర కు తగ్గించి నిర్వహించే అవకాశాలున్నాయి.

అలాగే ప్రశ్నా పత్రంలో కూడా చాయిస్ ఎక్కువగా ఇచ్చే యోచనలో విద్యాశాఖ ఉన్నట్టు సమాచారం. ఒకవేళ వ్యాసం రూపంలో సాధ్యం కాకపోతే ఆబ్జెక్టివ్‌ విధానంలో కూడా పరీక్షలు నిర్వహించే అవకాశాలున్నాయి.

ఈ మేరకు తయారు చేసిన ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి కసరత్తు కొనసాగిస్తున్నారు. త్వరలో సీఎం కేసీఆర్‌ నిర్వహించే విద్యాశాఖ సమీక్ష సమావేశంలో తుది నిర్ణయాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి.

Follow Us@