పదవ తరగతి పరీక్షలు ఆరు పేపర్లతోనే

పదవ తరగతి పరీక్షలను 2021 – 22 విద్యా సంవత్సరానికి గాను 11 పేపర్లకు గానూ 6 పేపర్లకు తగ్గిస్తూ పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. అలాగే ఉర్దూ ని ద్వితీయ భాషగా కూడా చేరుస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

కోవిడ్ 19 నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరానికి పదవ తరగతి పరీక్షలు ఆరు పేపర్లతో మాత్రమే నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం తో విద్యార్థులు మీద చాలా వరకు భారం తగ్గుతుంది.