హైదరాబాద్ (జనవరి – 31) : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి , ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ లో ప్రవేశాలకు గాను అర్హులైన బాలుర నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. రాత, శారీరక సామర్ధ్య, వైద్య పరీక్షల ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది.
◆ అర్హతలు : 6వ తరగతి ప్రవేశాలకు గుర్తింపు పొందిన పాఠశాలలో ఐదవ తరగతి చదువుతూ ఉండాలి.
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం (ఎంపీసీ) ప్రవేశాలకు పదవ తరగతి చదువుతూ ఉండాలి.
తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1,50,000 పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు లక్షలకు మించి ఉండకూడదు.
◆ వయోపరిమితి : 11 ఏళ్ళు ఉండాలి. (ఏప్రిల్ – 1 2012 నుండి మార్చి – 31 -2014 మధ్య జన్మించి ఉండాలి.
ఇంటర్ కు 16 ఏళ్ళు ఉండాలి. (ఏప్రిల్ – 1 2007 నుండి మార్చి – 31 -2009 మధ్య జన్మించి ఉండాలి.)
◆ సీట్ల సంఖ్య : ఆరో తరగతి (80 సీట్లు), ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ లో (80 సీట్లు)
◆ ఎంపిక విధానం : మూడు దశల్లో ఉంటుంది, మరియు వైద్య పరీక్షలు ఆధారంగా ఎంపిక చేస్తారు
◆ దరఖాస్తు ఫీజు: రూ.200.
◆ దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
◆ ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: జనవరి – 31- 2023.
◆ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి – 15 – 2023.
◆ హాల్టికెట్ డౌన్లోడ్ : ఫిబ్రవరి – 17- 2023.
◆ ప్రవేశ పరీక్ష తేదీ : ఫిబ్రవరి – 26 – 2023.
◆ పరీక్ష ఫలితాల విడుదల: మార్చి – 08 – 2023.
◆ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ తేదీలు: మార్చి – 20, 22, 24,25, 26 – 2023.
◆ తుది ఫలితాల ప్రకటన: మార్చి – 28 – 2023.
◆ పాఠశాలలో ప్రవేశాల ప్రారంభం: మార్చి – 30 – 2023.