TS SET 2023 : దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్ (ఆగస్టు – 29) : అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్ పోస్టులకు అర్హత కోసం నిర్వహించే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2023 (TS SET 2023 LAST DATE Extended) దరఖాస్తు గడువు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా సెప్టెంబర్ – 04 వరకు పొడిగించారు.

ఈసారి 29 సబ్జెక్టులకు గాను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో ఈ పరీక్షలను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తుంది

1,500, 2,000, 3,000 ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 10, 18, 24 వరకు గడువు కలదు. దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ సెప్టెంబర్ 26, 27 వ తేదీలలో కలదు.

ఈ పరీక్షలను అక్టోబర్ 28, 29, 30వ తేదీలలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లు అక్టోబర్ 20 నుండి అందుబాటులో ఉండనున్నాయి.

వెబ్సైట్ : http://www.telanganaset.org/index.htm