TS SET 2023 : నేటితో ముగుస్తున్న దరఖాస్తు గడువు

హైదరాబాద్ (ఆగస్టు – 29) : అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్ పోస్టులకు అర్హత కోసం నిర్వహించే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2023 (TS SET 2023 LAST DATE) దరఖాస్తు గడువు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా నేటితో ముగియనుంది.

ఈసారి 29 సబ్జెక్టులకు గాను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో ఈ పరీక్షలను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తుంది

1,500, 2,000, 3,000 ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 4, 9, 12 వరకు గడువు కలదు. దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ సెప్టెంబర్ 13, 14 వ తేదీలలో కలదు.

ఈ పరీక్షలను అక్టోబర్ 28, 29, 30వ తేదీలలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లు అక్టోబర్ 20 నుండి అందుబాటులో ఉండనున్నాయి.

వెబ్సైట్ : http://www.telanganaset.org/index.htm