- 29 సబ్జెక్టులకు నిర్వహణ
హైదరాబాద్ డిసెంబర్ – 07) : తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS SET – 2022) నోటిఫికేషన్ ను డిసెంబర్ 22న విడుదల చేయనున్నట్లు కన్వీనర్ మురళీకృష్ణ తెలిపారు. ఈ సంవత్సరం కూడా సెట్ నిర్వహణకు ఉస్మానియా యూనివర్సిటీకి యూజీసీ అవకాశం కల్పించింది.
TS SET నోటిఫికేషన్ విడుదలకు అన్ని ప్రక్రియలు పూర్తి చేశామన్నారు. యూజీసీ అధికారులతో చివరి విడత చర్చల అనంతరం గతంలో 2019 నిర్వహించిన 29 సబ్జెక్టులకు అర్హత పరీక్షను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.