హైదరాబాద్ (డిసెంబర్ – 22) : తెలంగాణ రాష్ట్ర స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS SET 2022) నోటిఫికేషన్ ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది.
అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు లెక్చరర్ పోస్టుల కు అర్హతగా నిర్వహించే సెట్ పరీక్ష దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 30 నుండి ప్రారంభం కానుంది. పరీక్షను మార్చి 2023లో నిర్వహించనున్నారు.
పరీక్ష విధానము పేపర్ – 1 లో 50 ప్రశ్నలకు వంద మార్కులకు, పేపర్ – 2లో 100 ప్రశ్నలకు 200 మార్కుల కేటాయిస్తూ మొత్తం 300 మార్కులకు నిర్వహించనున్నారు.
వెబ్సైట్ : www.telanganaset.org