తెలంగాణ రాష్ట్రంలో రెండు మూడు వారాల్లో పాఠశాలలు తెరుచి, రెగ్యులర్ తరగతులు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు విద్యాశాఖ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుని, ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. సర్కారు అనుమతిస్తే తరగతులు ప్రారంభిస్తారు.
స్థానిక సంస్థల సహకారంతో స్కూళ్లు, తరగతి గదులను శానిటైజ్ చేయిస్తున్నారు. స్కూళ్లు ప్రారంభమైన తర్వాత విద్యార్థులు భౌతికదూరం పాటించేందుకు వీలుగా బెంచీలకు మధ్య దూరం పాటిస్తూ తరగతి గదిలో 20 మంది ఉండేలా చూస్తున్నారు. భౌతికదూరం పాటించడాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను సైతం ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులకు ఇమ్యూనిటీ పెంచేందుకు మధ్యాహ్న భోజనంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని అందించనున్నారు.
Follow Us@