ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలలో రెగ్యులర్, బ్యాక్‌లాగ్ ప్రవేశ నోటిఫికేషన్

హైదరాబాద్ (ఫిబ్రవరి – 09) : తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాలలో ఆరవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు 2023 24 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. గురుకులాల్లో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ సీట్లను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సెక్రటరీ రోనాల్డ్ రాస్ ఒక ప్రకటనలో తెలిపారు..

◆ రెగ్యులర్ ప్రవేశాలు జరుగు గురుకులాలు :

ఎస్సీ గురంకులాల్లో.. కరీంనగర్ జిల్లా అలుగునూరు‌, రంగారెడ్డి జిల్లా గౌలిదొడ్డి సీవోఈ కాలేజ్ మరియు 9వ తరగతి రెగ్యులర్ అడ్మిషన్స్.

ఎస్టీ గురుకులాల్లో… వికారాబాద్ జిల్లా స్కూల్ ఆఫ్క్సలెన్స్ ఫరిగి(G), ఖమ్మం జిల్లా ఖమ్మం (B) గురుకులాల్లో కేవలం 8వ తరగతి మాత్రమే రెగ్యులర్ అడ్మిషన్స్.

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్

◆ దరఖాస్తు ప్రారంభం : ఫిబ్రవరి – 09 – 2023

◆ దరఖాస్తు చివరి తేదీ : మార్చి – 07 – 2023

◆ పరీక్ష తేదీ : ఎప్రిల్ – 16 (ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు)

వెబ్సైట్ : https://www.tswreis.ac.in/

http://tgtwgurukulam.telangana.gov.in/

Follow Us @