TSRTC : గవర్నమెంట్ లో విలీనం

హైదరాబాద్ (జూలై – 31) : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ మండలి (ts cabinate meet) కీలక నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను (TSRTC) ప్రభుత్వంలో విలీనం చేయనున్నది.

త్వరలో జరిగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనున్నది. అనంతరం ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు.

ఈ నిర్ణయం తో దాదాపు 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. 3వ తేదీన ప్రారంభమయ్యే సమావేశంలోనే ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియను ప్రారంభిస్తూ శాసనసభలో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టనున్నది. వెంటనే దానికి సంబంధిన కార్యాచరణ ప్రారంభించాలని రవాణాశాఖ, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రికి సీఎం కేసీఆర్‌ ఆదేశాలు ఇవ్వడం జరిగింది’ అని కేటీఆర్‌ తెలిపారు.