ఆర్టీసీ ఉద్యోగులు మాత్రమే విలీనం – సంస్థ కాదు

హైదరాబాద్ (ఆగస్టు – 05) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలోకి విలీనం చేసుకుంటున్నట్లు సంస్థ ను యధాతధంగా కార్పొరేషన్ లాగే ఉంచనున్నట్లు గవర్నర్ తమిళిసై లేవనెత్తిన ప్రశ్నలకు సమాదానంగా చెప్పింది.

ఆర్టీసీ విలీన బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపగా తమిళిసై 5 ప్రశ్నలను లేవనెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ విధంగా సమాధానం చెప్పింది.

సంస్థ ప్రభుత్వంలో విలీనం కాకపోవడంతో కేంద్రం ఇచ్చే గ్రాంట్ లు, సంస్థకు ఉన్న అప్పులు, విభజన అంశాలపై ఎటువంటి సమస్యలు ఉండవని తేల్చి చెప్పింది.