పిఆర్సి రిపోర్టుపై త్రిసభ్య కమిటీ కాంట్రాక్ట్ లెక్చరర్స్ సమస్యలు వినటానికి అవకాశం ఇవ్వాలి – కొప్పిశెట్టి

తెలంగాణ తొలి పిఆర్సి రిపోర్టుపై ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ కాంట్రాక్టు ఉద్యోగులు మరియు లెక్చరర్ల సమస్యలు వినటానికి అవకాశం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ,కార్యదర్శులు జి రమణారెడ్డి, డాక్టర్. కొప్పిశెట్టి సురేష్ లు డిమాండ్ చేశారు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సి.ఆర్ బిశ్వాల్ మరియు ఉమామహేశ్వర రావు, రపత్ అలీల ఆధ్వర్యంలో తెలంగాణ తొలి పి ఆర్ సి కమిటీ ఏర్పాటు చేసిన సందర్భంగా కాంట్రాక్ట్ లెక్చరర్ సమస్యలపై సవివరమైన నివేదికను సి.ఆర్. బిశ్వాల్ కమిటీకి అందజేయడం జరిగిందని తెలిపారు, నిన్న విడుదల చేసిన తెలంగాణ తొలి పిఆర్సి రిపోర్టులో మొట్టమొదటిసారిగా కాంట్రాక్టు ఉద్యోగులు/ లెక్చరర్స్ గురించి ఒక చాప్టర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు, ఇందులో తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మరియు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పని చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్స్ గురించి పేర్కొనడం జరిగిందని తెలిపారు. అయితే గత 10వ పిఆర్సి రిపోర్టులో కాంట్రాక్ట్ లెక్చరర్స్ కు BASIC pay తో పాటు H .R .A & D.A ఇవ్వాలని పేర్కొనడం జరిగిందని, కానీ తెలంగాణ తొలి పిఆర్సి ఈ విషయంలో స్పందించక పోవడం విచారకరమని తెలిపారు.

సి.ఆర్. బిశ్వాల్ ఇచ్చిన రిపోర్టు పై ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ మరియు ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు మరియు సీనియర్ ఐఏఎస్ అధికారి రజిత్ కుమార్ లతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి కాంట్రాక్టు మరియు ఉద్యోగుల సమస్యలను వినాలని ఆదేశించడం జరిగిందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో అన్ని విభాగాల్లో కూడా పర్మినెంటు ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు కూడా ఈ కమిటీ పరిశీలించాలని, ప్రభుత్వ ఉన్నత విద్యారంగంలో కీలకమైన పాత్ర వహిస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ సమస్యలను వినటానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు, తక్షణం కాంట్రాక్టు ఉద్యోగులు/ లెక్చరర్స్ సమస్యలను నివేదించడానికి వెంటనే త్రిసభ్య కమిటీ అపాయింట్మెంట్ ఇవ్వాలని రాష్ట్ర నాయకులు డాక్టర్ శ్రీనివాస్, నాయిని శ్రీనివాస్, కురుమూర్తి ,గోవర్ధన్, గంగాధర్ దేవేందర్ , జబి ఉల్లా, కాంపల్లి శంకర్, సంగీత, ఉదయశ్రీ, శైలజ, వైకుంఠం ప్రవీణ్, తదితరులు రాష్ట్ర ప్రభుత్వానికి మరియు త్రిసభ్య కమిటీ విజ్ఞప్తి చేశారు.

Follow Us@