హైదరాబాద్ (జూలై – 19) : తెలంగాణ రాష్ట్ర పాలిటెక్నిక్ కళాశాలల్లో మొదటి, రెండో దశ పాలిసెట్ కౌన్సెలింగ్ లలో సీట్లు పొంది, కళాశాలలో చేరిన విద్యార్థులు కోర్సులు అదే కళాశాలలో కోర్సులు మారేందుకు స్లైడింగ్ (ts polytechnic internal sliding option ) అవకాశం కల్పించారు.
అభ్యర్థులకు జూలై 19, 20వ తేదీలలో ఇంటర్నల్ స్లైడింగ్ వెబ్ ఆప్షన్ల ను ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. స్లైడింగ్ లో పాల్గొన్న వారికి జూలై 23న సీట్లను కేటాయించనుండగా, 24న అలాట్మెంట్ ఆర్డర్ను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్లైడింగ్ లో సీటు వచ్చిన వారికి ఫీజు రీఎంబర్స్మెంట్ వర్తిస్తుంది.
పాలిటెక్నిక్ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను జూలై 28లోపు పూర్తిచేయాలని అధికారులు ఆదేశించారు.