POLYCET COUNSELING : పాలిటెక్నిక్ సీట్లు పెంపు‌, కౌన్సెలింగ్ లో మార్పులు

హైదరాబాద్ (జూలై – 06) : తెలంగాణలో పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రభుత్వం 1170 సీట్లను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 11 పాలిటెక్నిక్ కళాశాలల్లో కొత్త కోర్సులు, అదనపు సీట్లకు అనుమతిస్తున్నట్టు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా బోర్డు వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. (ts polycet counseling rescheduled and polytechnic seats increased)

పాలిసెట్ తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్లోనూ పలు మార్పులు చేసింది. జులై 7న పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల కానుండటం, సీట్ల పెంపు నేపథ్యంలో ఈ షెడ్యూల్లో మార్పులు చేసినట్టు
పేర్కొంది.

సవరించిన షెడ్యూల్ ప్రకారం..

◆ జులై 8, 9 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి.

◆ జులై 10న పాలిసెట్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన.

◆ జులై 8 నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం.

◆ జూలై 14న తుది విడత పాలిటెక్నిక్ కోర్సుల్లో సీట్ల కేటాయింపు