హైదరాబాద్ (జనవరి – 09) : తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల ప్రదేశాల కోసం అలాగే అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ డిప్లోమా కోర్సుల్లో 2023 – 24 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ – 2023 నోటిఫికేషన్ ఈరోజు సాంకేతిక విద్యాశాఖ విడుదల చేసింది.
పదవ తరగతి తత్ సమానమైన తరగతి ఉత్తీర్ణులైన వారు ప్రస్తుతం విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు
షెడ్యూల్ :
◆ దరఖాస్తు ప్రారంభం : జనవరి – 16 – 2023
◆ దరఖాస్తు చివరి తేదీ : ఎప్రిల్ – 24 – 2023,
◆ 100/- ఆలస్య రుసుముతో : ఎప్రిల్ – 25 – 2023
◆ పరీక్ష తేదీ : మే – 17 – 2023