TS POLYCET : దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్ (ఎప్రిల్‌ – 26) : తెలంగాణ రాష్ట్ర పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (TS POLYCET 2023) దరఖాస్తు గడువును పెంచినట్లు సాంకేతిక విద్య కార్యదర్శి డాక్టర్ సి.శ్రీ నాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే 98 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.

మే 14 – 2023 వరకు 200/- ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్నారు.

మే 17న పాలిసెట్ పరీక్ష నిర్వహించనుండగా, ఫలితాలను పరీక్ష జరిగిన పదిరోజుల్లో వెల్లడిస్తామని వెల్లడించారు.