హైదరాబాద్ (ఎప్రిల్ – 22) : తెలంగాణ పాలిటెక్నిక్ లో ప్రవేశించేందుకు నిర్వహించే పాలిసెట్ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఎప్రిల్ 24వ తేదీతో ముగియనున్నట్లు రాష్ట్ర రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి కార్యదర్శి, పరీక్ష కన్వీనర్ డాక్టర్ సి. శ్రీనాధ్ తెలిపారు.
రూ.100 ఆలస్య రుసుంతో ఎప్రిల్ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మే 17న పాలిసెట్ ప్రవేశ పరీక్ష జరగనుంది.
◆ వెబ్సైట్ : https://www.polycet.sbtet.telangana.gov.in