హైదరాబాద్ (మే – 17) : తెలంగాణ పాలిటెక్నిక్ కళాశాలలో 2023 – 24 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ 2023 ప్రవేశ పరీక్షను నేడు రాష్ట్ర వ్యాప్తంగా 296 పరీక్ష కేంద్రాలలో నిర్వహించనున్నారు.
పరీక్ష ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 1.30 వరకు జరగనుంది. పరీక్ష హల్ లోకి ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతి లేదని నిర్వహకులు స్పష్టం చేశారు.
విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి ఉదయం 10.00 గంటల నుండి అనుమతిస్తారు.
విద్యార్థులు పరీక్ష కేంద్రం లోకేషన్ లో SBTET TS APP ను డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు.
హల్ టికెట్లు మీద పోటో పడని అభ్యర్థులు పాస్పోర్ట్ సైజ్ పోటో, గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలి.