హైదరాబాద్ (జనవరి – 29) : తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSPLRB) కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సై, కానిస్టేబుల్ నియామక పరీక్షలో మల్టిపుల్ జవాబులున్న ప్రశ్నలకు మార్కులు కలపాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని నిర్ణయించింది.
దీని ప్రకారం ఏడు మార్కులు కలపనున్నట్లు సమాచారం. రేపటి నుంచి అభ్యర్థుల వివరాలు సైట్ లో ఉంటాయని పేర్కొంది. మార్కులు కలిపిన తర్వాత క్వాలిఫై అయిన వారికి ఫిబ్రవరి 15 నుంచి ఈవెంట్స్ ఉంటాయని TSLPRB తెలిపింది.
క్వాలిఫై అయిన అభ్యర్థులు ఫిబ్రవరి 1 నుంచి 5వ తారీఖు లోపు ఫామ్ – 2 ను నింపవలసి ఉంటుంది. ఫిబ్రవరి 8 – 10 మధ్యలో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు.