POLICE JOBS : సర్టిఫికెట్ల వెరిఫికేషన్ షెడ్యూలు విడుదల – TSPLRB

హైదరాబాద్ (జూన్ – 08) : తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSPLRB) ఎస్సై, కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో అభ్యర్థులు సర్టిఫికెట్ ల వెరిఫికేషన్ *SI, CONSTABLE CERTIFICATE VERIFICATION) షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 14 నుండి 26వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 18 కేంద్రాలలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ను చేపట్టనుంది.

ఇప్పటికే తుది ఫలితాలను విడుదల చేసిన నియామక బోర్డు సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం తుది ఎంపికల కోసం కట్ ఆఫ్ మార్కులను ప్రకటించనుంది.

◆ సమర్పించాల్సిన సర్టిఫికెట్లు

  • విద్యా సంబంధించిన సర్టిఫికెట్ లు
  • కుల ధ్రువీకరణ పత్రము (2014 జూన్ 2 తర్వాత తేదీతో ఉండాలి)
  • బీసీ అభ్యర్థలకు నాన్ క్రిమి లేయర్ సర్టిఫికెట్ (2021 ఏప్రిల్ – 01 తర్వాత ఉండాలి)
  • ఆర్థికంగా వెనుకబడిన తరగతుల సర్టిఫికెట్ (2021 ఏప్రిల్ – 01 తర్వాత ఉండాలి)