హైదరాబాద్ (మే – 30) : తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSPLRB) ఎస్సై, కానిస్టేబుల్ తుది ‘కీ’ మరియు పరీక్ష ఫలితాలను (SI, CONSTABLE FINAL KEY & RESULTS) విడుదల చేసింది.
తుది ‘కీ’ మీద అభ్యంతరాలు ఉంటే రికౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చని… రీకౌంటింగ్ కు ₹2,000/- , రీ వెరిఫికేషన్ కు ₹3,000/- చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 1వ తారీకు ఉదయం 8.00 గంటల నుండి జూన్ 3వ తేదీ సాయంత్రం 8.00 గంటల వరకు అభ్యర్థులు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.