PGECET 2023 : నేటి నుంచి రెండో దశ కౌన్సెలింగ్

హైదరాబాద్ (సెప్టెంబర్ – 20) : తెలంగాణ రాష్ట్రంలోని ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్, ఎంఫార్మసీ, ఫార్మాడీ కోర్సుల్లో ప్రవేశానికి సెప్టెంబర్ 20 నుంచి రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు (TS PGECET 2023 second phase counselling) కన్వీనర్ రమేశ్ బాబు తెలిపారు.

మొత్తం పీజీఈసెట్ పరిధిలో 7,922 కన్వీనర్ కోటా కింద సీట్లు ఉంటే, తొలి దశలో 5,662 సీట్లు కేటాయించారు. ఇందులో 3,638 మంది రిపోర్టు చేశారు. రెండో దశ కౌన్సెలింగ్ లో మొత్తం 4,284 సీట్లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

షెడ్యూల్ :

సెప్టెంబర్ 20 నుంచి 24వ తేదీ వరకు రెండో దశ కింద ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ గడువు కలదు.

సెప్టెంబర్ 27 నుంచి 28 వరకు వెబ్ ఆప్షన్లు అవకాశం కలదు.

అక్టోబర్ 3వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది.

సీట్లు పొందిన అభ్యర్థులు అక్టోబర్ 4-7 తేదీల మధ్య కళాశాలలో రిపోర్టు చేయాలని సూచించారు.

వెబ్సైట్ : https://pgecetadm.tsche.ac.in/