TS PECET 2023 COUNSELING SCHEDULE విడుదల

హైదరాబాద్ (సెప్టెంబర్ – 14) : తెలంగాణ ఉన్నత విద్యాశాఖ 2023 – 25 విద్యా సంవత్సరానికి సంబంధించిన రెండేళ్ల బిపీఈడి, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన TS PECET 2023 ప్రవేశాలకు సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్ (TS PECET COUNSELING SCHEDULE)ను విడుదల చేసింది. పూర్తి నోటిఫికేషన్ సెప్టెంబర్ 19న విడుదల చేశారు.

సెప్టెంబర్ 20 నుంచి 25 వరకు అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

TS PECET COUNSELING SCHEDULE

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ దరఖాస్తుల పరిశీలన : సెప్టెంబర్ 20 నుండి 25 వరకు

అభ్యర్థుల జాబితా ప్రదర్శన : సెప్టెంబర్ 27

వెబ్ ఆప్షన్ల నమోదు : సెప్టెంబర్ 28 నుండి 29 వరకు

సీట్ల కేటాయింపు : సెప్టెంబర్ 30న

కళాశాలలో రిపోర్టింగ్ గడువు : అక్టోబర్ 04 నుండి 07 వరకు

వెబ్సైట్ : https://pecet.tsche.ac.in/