హైదరాబాద్ (ఆగస్టు – 12) : TS ICET 2023 COUNSELING SCHEDULE లో మార్పులు చేశారు. ఆగస్టు 14న జరగాల్సిన కౌన్సెలింగ్ వాయిదా పడింది. నూతన షెడ్యూల్ ప సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభం కానున్నట్లు కాకతీయ యూనివర్సిటీ తెలిపింది.
◆ మొదటి దశ : సెప్టెంబర్ 8 నుంచి 12 వరకు ధ్రువపత్రాల పరిశీలన, 8 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 17న ఎంసీఏ, ఎంబీఏ తొలివిడత సీట్ల కేటాయింపు ఉంటుంది.
◆ రెండో దశ : 22వ తేదీ నుంచి తుది విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. 28న ఎంబీఏ, ఎంసీఏ తుది విడత సీట్ల కేటాయింపు ఉంటుంది.
◆ స్పాట్ కౌన్సెలింగ్ : సెప్టెంబర్ 29న స్పాట్ ప్రవేశాలకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు కాకతీయ వర్సిటీ తెలిపింది.