త్వరలో మోడల్ స్కూల్ టీచర్లకు బదిలీలు.

తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూల్ లో నియామకం జరిగినప్పటి నుంచి బదిలీ లేక ఇబ్బంది పడుతున్న టీచర్లకు వెంటనే బదిలీలు జరపాలని ఈరోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు ఎమ్మెల్సీలు MLC లు జనార్దన్ రెడ్డి, రఘోత్తం రెడ్డిల ఆద్వర్యంలో PRTU రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కమలాకర్ రావులు వినతి పత్రం ఇస్తూ బదిలీల గూర్చి మరియు ఇతర సమస్యల గురించి చర్చించడం జరిగింది.

దీనిపై సీఎస్ సోమేశ్ కుమార్ స్పందిస్తూ ఖచ్చితంగా మోడల్ స్కూల్ టీచర్స్ బదిలీలు అతి త్వరలో చేపడతామని హమీ ఇచ్చారని ఒక ప్రకటనలో తెలిపారు.

దీని పట్ల PMTA TS రాష్ట్ర అధ్యక్షుడు సీఎస్ సోమేశ్ కుమార్ కు ఎమ్మెల్సీలకు మరియు PRTU నాయకులకు మోడల్ స్కూల్ టీచర్ల తరపున కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us@