మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్షలు వాయిదా, దరఖాస్తు గడువు పెంపు.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో మోడల్ స్కూల్ లలో 6 నుండి 10 వ తరగతి ప్రవేశ పరీక్షలను వాయిదా వేసింది.

7 నుంచి 10వ తరగతి ప్రవేశాల కోసం జూన్‌ 5న ఈ పరీక్ష జరగాల్సి ఉండగా, 6వ తరగతిలో ప్రవేశాల కోసం జూన్‌ 6న పరీక్షలు జరగాల్సి ఉంది. ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువును సైతం జూన్‌ 20 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

పరీక్షల తేదీలను తర్వాత ప్రకటిస్తామని ఆదర్శ పాఠశాలల ప్రాజెక్టు డైరెక్టర్‌ వెల్లడించారు.

Follow Us@