మైనార్టీ గురు‌కు‌లాల్లో ప్రవే‌శాలకు దర‌ఖాస్తు గడు‌వు పొడిగింపు

తెలంగాణ రాష్ట్రం లోని మైనార్టీ గురు‌కు‌లాల్లో క‌రోనా నేప‌థ్యంలో 2021–22 విద్యా సంవ‌త్స‌రా‌నికి ప్రవే‌శాలకు సంబంధించిన‌ దర‌ఖాస్తు గడు‌వును పొడిగించారు.

మే నెల 31 వరకు అప్లికేష‌న్ గ‌డువును పొడి‌గిస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు TMRIS మొబైల్ యాప్‌ లేదా వెబ్సైట్ ద్వారా ఉచితంగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించారు.

5 నుంచి 8వ తర‌గతి, ఇంటర్‌ మొదటి సంవ‌త్సరం ప్రవే‌శాల కోసం ఆన్‌లై‌న్‌లో అప్లై చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు. ఏవైనా సందే‌హా‌లుంటే 040–23437909 హెల్ప్‌‌లైన్‌ నంబ‌ర్‌కు ఫోన్‌‌ చే‌యా‌లని కోరారు.

వెబ్సైట్ :: www.tmreis.telangana.gov.in

Follow Us@