50% సిబ్బందితో పని చేయనున్న ప్రభుత్వ ఆఫీసులు

తెలంగాణ ప్రభుత్వం జూన్ 9వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే సడలింపు సమయాన్ని ఉదయం6 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇచ్చింది. 

వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు, పైర్, పంచాయతీ రాజ్, ఎలక్ట్రిసిటి – నీటి సరఫరా, వ్యవసాయ అనుబంధ శాఖలు, సివిల్ సప్లయస్‌, ఎక్సైజ్ కమర్షియల్ టాక్స్, ట్రాన్సపోర్ట్, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ వంటి ప్రభుత్వ శాఖలు పూర్తి స్థాయిలో పని చేయనున్నాయి.

మిగిలిన ప్రభుత్వ శాఖలు 50% సిబ్బంది హజరుతో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పని చేయాలని సూచించింది.

అలాగే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా 50% సిబ్బందికి మించకుండా పని చేయాలని పేర్కొన్నారు.

Follow Us@